
తెలంగాణకు రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కోటా పెంపు
దిల్లీ: కరోనా నియంత్రణలోభాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, టీకాల సరఫరాను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న రెమ్‌డెసివిర్‌లను 5500 నుంచి 10500లకు పెంచుతున్నట్టు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుండటంతో 200 టన్నుల ఆక్సిజన్‌ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ నుంచి, ఒడిశాలోని అంగుల్, పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ నుంచి తెలంగాణకు ఆక్సిజన్ సరఫరా చేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాలని సీఎం కేసీఆర్‌ను పీయూష్ గోయల్ కోరారు. టీకాలను కూడా పెద్ద మొత్తంలో సరఫరా చేయాలని సీఎం కోరిన నేపథ్యంలో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.