Polavaram: పోలవరం పూర్తిచేసేందుకు సహకారం అందిస్తాం: కేంద్రమంత్రి షెకావత్‌

ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. సీఎం జగన్‌తో కలిసి..

Updated : 04 Mar 2022 13:45 IST

సీఎం జగన్‌తో కలిసి నిర్వాసిత గ్రామాల్లో పర్యటన

పోలవరం: ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. సీఎం జగన్‌తో కలిసి పోలవరం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఇందుకూరు-1లో ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ, ఏనుగులగూడెంలో పోలవరం నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో షెకావత్‌ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరముందన్నారు. పునరావాస కాలనీని పరిశీలించానని.. వసతులు బాగున్నాయని చెప్పారు. పోలవరం పూర్తిచేసేందుకు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి చెప్పారు.

నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం: జగన్‌

సీఎం జగన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి అని..కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకుని దీన్ని పూర్తిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పునరావాస పనులపై అధికారులు మరింత దృష్టి పెట్టాల్సి అవసరముందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితేనే రాష్ట్ర సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్వాసితులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని జగన్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని