ప్రియురాలికోసం పెళ్లి కుమార్తె అవతారమెత్తిన యువకుడు

తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం జరగడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆమెను కలిసేందుకు ఏకంగా పెళ్లి కుమార్తె అవతారమెత్తాడు.

Published : 04 Jun 2021 23:01 IST

బదోహి: తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం జరగడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆమెను కలిసేందుకు ఏకంగా పెళ్లి కుమార్తె అవతారమెత్తాడు. ఆమె ఇంటికి అలా వెళితే ఎవరూ అనుమానించరని భావించాడు. ఎర్రచీర కట్టుకొని, నగలు ధరించి, మేకప్‌ వేసుకొని, చేతినిండా గాజులతోపాటు విగ్గు పెట్టుకొని పెళ్లి జరుగుతున్న ప్రియురాలి ఇంటికెళ్లాడు. ఇంత చేసినా.. పెళ్లి కుమార్తె బంధువులకు అడ్డంగా దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదోహికి చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. అయితే ఆ యువతికి వేరొకరితో పెళ్లి కుదిర్చారు పెద్దలు. పెళ్లిరోజు రానేవచ్చింది. దీంతో ప్రియురాలిని ఎలాగైనా కలవాలనుకున్నాడు. పెళ్లి కుమార్తె తరహాలో ముస్తాబై ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆమె గదిలోకి వెళుతుండగా.. అక్కడున్నవారికి అనుమానం వచ్చింది. అక్కడే ఆపి, పలు ప్రశ్నలు వేశారు. వచ్చినవాడు యువకుడే అని నిర్ధరించుకొని, అతడి విగ్గును తొలగించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి, అతడు అక్కడి నుంచి పారిపోయాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు