Will: ₹1.5 కోట్ల ఆస్తిని ప్రభుత్వం పేరిట రాసిన 85 ఏళ్ల వృద్ధుడు.. ఎందుకంటే?
భార్య చనిపోయిన తర్వాత నాథూ సింగ్ చాలా కాలం ఒంటరిగానే గడిపారు. ఏడు నెలల క్రితం సొంత ఊళ్లోనే ఉన్న ఓ వృద్ధాశ్రమానికి మారారు. కనీసం చూడడానికి కూడా తనవారెవరూ రాకపోవడంతో నాథూ సింగ్ మనసు విరిగింది. ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం పేరిట రాయాలని నిశ్చయించుకున్నారు.
ముజఫర్‌పూర్: సొంత పిల్లలపై కోపంతో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నాథూ సింగ్ అనే 85 ఏళ్ల వృద్ధుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రూ.1.5 కోట్లు విలువ చేసే తన ఆస్తిని ప్రభుత్వం పేరిట వీలునామా రాశారు. తాను మరణించిన తర్వాత శవాన్ని వైద్యకళాశాలకు అప్పగించాలని కోరారు. తన కొడుకు, కూతుళ్లు కనీసం తన శవాన్ని కూడా తాకొద్దని వీలునామాలో పేర్కొనడం గమనార్హం.
ముజఫర్‌పూర్‌కు చెందిన నాథూసింగ్‌కు ఓ ఇల్లు, స్థలం ఉన్నాయి. వాటి విలువ రూ.1.5 కోట్లు. ఆయనకు ఓ కొడుకు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లయ్యాయి. కొడుకు సహరాన్‌పూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య చనిపోయిన తర్వాత నాథూ సింగ్ చాలా కాలం ఒంటరిగానే గడిపారు. ఏడు నెలల క్రితం సొంత ఊళ్లోనే ఉన్న ఓ వృద్ధాశ్రమానికి మారారు.
అయితే, కనీసం చూడడానికి కూడా తనవారెవరూ రాకపోవడంతో నాథూ సింగ్ మనసు విరిగింది. తన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వ పేరిట రాయాలని నిశ్చయించుకున్నారు. తన మరణం తర్వాత ఆ స్థలంలో ఆసుపత్రి, స్కూల్ నిర్మించాలని కోరారు. ‘‘ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సింది. కానీ, వాళ్లు నన్ను బాగా చూసుకోవడం లేదు. అందుకే నేను నా ఆస్తిని ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని నాథూ సింగ్ ఓ మీడియా సంస్థతో అన్నారు.
నాథూ సింగ్ వృద్ధాశ్రమంలో చేరినప్పటి నుంచి ఆయన్ని చూడడానికి ఎవరూ రాలేదని ఆశ్రమ మేనేజర్ రేఖా సింగ్ తెలిపారు. ఆయన చాలా కుంగుబాటుకు లోనయ్యారని.. అందుకే ఆస్తి బదిలీ విషయంలో చాలా మొండిగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు నాథూ సింగ్ నుంచి తమకు అఫిడవిట్ అందినట్లు స్థానిక సబ్-రిజిస్ట్రార్ తెలిపారు. నాథూ సింగ్ మరణం తర్వాత ఆ వీలునామా అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
AP Govt: పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు
-
World News
PM Modi: మోదీ అసాధారణ నేత.. చైనాలో భారీగా ఆదరణ
-
Politics News
Balineni: పట్టభద్రుల్లో అసంతృప్తి నిజమే: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
-
Ap-top-news News
AP Govt: ఎవరి గ్లాసు వారే తెచ్చుకోండి.. రాగి జావ పోస్తాం
-
Politics News
Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే.. 2024 పూర్తి సినిమా: నారా లోకేశ్