Telangana news: సెప్టెంబర్‌ నుంచి బీ1, బీ2 వీసాల ఇంటర్వ్యూలు

అమెరికాలో పర్యటించేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్‌. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన బీ1, బీ2 టూరిజం, విజిట్‌, బిజినెస్‌ వీసాలకు ఇంటర్వ్యూలను

Published : 28 Apr 2022 01:26 IST

హైదరాబాద్‌: అమెరికాలో పర్యటించేందుకు వీసా కోసం ఎదురుచూస్తున్న గుడ్‌న్యూస్‌. కరోనా ప్రభావంతో రెండేళ్లుగా నిలిచిపోయిన బీ1, బీ2 టూరిజం, విజిట్‌, బిజినెస్‌ వీసాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు అమెరికా కాన్సులేట్‌ అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్‌ నుంచి బీ1, బీ2 వీసాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించారు. తొలిసారి బీ1, బీ2 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపింది. అయితే, త్వరలోనే ఈ వీసాల కోసం స్లాట్స్‌ అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. కొవిడ్‌ నేపథ్యంలో బీ1, బీ2, ఇతర వీసాల రెన్యువల్‌కు ఇంటర్వ్యూలు మినహాయింపు ఇచ్చి డ్రాప్‌ బాక్స్‌ సౌకర్యం కల్పించారు. కానీ గతంలో కొవిడ్‌కు ముందు స్లాట్స్‌ బుక్‌ చేసుకున్న బీ1, బీ2 వీసాలకు సంబంధించిన రీషెడ్యూల్‌ అంశంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని