యూఎస్ ఎలక్షన్స్: తొలి టీవీ డిబేట్ ఎవరిదంటే..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. అన్ని దేశాలకు పెద్దన్నగా నిలిచే అగ్రదేశానికి కాబోయే అధ్యక్షుడెవరనే దానిపై ఉత్కంఠ ఉంటుంది. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతిసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటుంది. అన్ని దేశాలకు పెద్దన్నగా నిలిచే అగ్రదేశానికి కాబోయే అధ్యక్షుడెవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠే. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. తాజాగా టెలివిజన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో పాల్గొన్నారు. పరిపాలన, ప్రజల ఆకాంక్షలు, దేశ సమస్యలు, పరిస్థితులు సహా వివిధ అంశాలపై ఇరువురు తమ వాదనలు ప్రజలకు వివరించారు. గత కొన్నేళ్లుగా ఈ టీవీ డిబేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు తమ అభిప్రాయాలను, ఆశయాలను టీవీ డిబేట్ ద్వారా నేరుగా ప్రజలకు చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ఒక భాగమైంది. అయితే తొలిసారి ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఎప్పుడు జరిగింది? ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు? ఎన్నికల ప్రచారంలో ఈ డిబేట్ కీలకంగా ఎందుకు మారిందో ఓ సారి చూద్దాం..
1960లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి టీవీ డిబేట్‌ను ప్రారంభించారు. అప్పటి ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున జాన్ ఎఫ్ కెనడీ, రిపబ్లిక్ పార్టీ తరఫున రిచర్డ్ నిక్సన్ అధ్యక్ష బరిలో దిగారు. ఎప్పటిలాగే ఎన్నిక ప్రచారాలకు సిద్ధమయ్యారు. ఆ కాలంలో అమెరికాలో దాదాపు అందరి ఇళ్లలో టీవీలు ఉండటంతో టీవీ డిబేట్ నిర్వహణకు బ్రాడ్‌కాస్ట్ కంపెనీ సీబీఎస్ శ్రీకారం చుట్టింది. ఈ టీవీ డిబేట్‌లో పాల్గొనేందుకు కెనడీ, నిక్సన్ ఒప్పుకోవడంతో 1960 సెప్టెంబర్ 26న ఈ కార్యక్రమాన్ని చికాగోలోని సీబీఎస్‌కి చెందిన స్టూడియోలో నిర్వహించారు. ఇరువురు ముఖాముఖిగా తలపడి తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు. తొలిసారి నిర్వహించిన ఈ డిబేట్‌లో అప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న నిక్సన్‌పై కెనడీ విజయం సాధించారు. ఈ డిబేట్‌ను 6.6 కోట్ల మంది వీక్షించారు. అప్పట్లో అమెరికా జనాభా 17.9 కోట్లు.
టీవీలో కనిపించిన తీరే కెనడీ విజయానికి నాంది
అప్పటి వరకు రేడియోల్లో.. పత్రికల్లో తమ ప్రసంగాలు, వ్యాసాల ద్వారా ప్రజలకు చేరువైన అభ్యర్థులు నేరుగా టీవీలో కనిపించడం అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారింది. అయితే ఈ డిబేట్‌కు కొన్నిరోజుల ముందు నిక్సన్ అనారోగ్యానికి గురై కాస్త బలహీనంగా ఉన్నారు. డిబేట్‌లో పాల్గొనేందుకు మేకప్ వేసుకోమంటే అందుకు ఆయన నిరాకరించారు. పైగా బూడిద రంగు కోట్ ధరించారు. వెరసి నిక్సన్ టీవీలో చూడటానికి అంత ఆకర్షణీయంగా కనిపించలేదు. మరోవైపు కెనడీ అధ్యక్ష బరిలో దిగిన అతిపిన్న వయస్కుడు. నీలిరంగు కోట్ వేసుకోని ఆకర్షణీయంగా కనిపించారు.
నిక్సన్ తనవైపు చూసి మాట్లాడుతుంటే.. కెనడీ కెమెరా వైపు చూస్తూ.. ప్రజలతో నేరుగా మాట్లాడుతున్న అనుభూతి కలిగించారు. ఆకర్షణీయంగా కనిపించడం, ఆకట్టుకునేలా మాట్లాడటంతో తొలి డిబేట్‌లో కెనడీ గెలుపొందారు. ఆ తర్వాత మరో మూడు డిబేట్‌లు జరిగాయి. తొలి డిబేట్‌లో తన ఓటమికి కారణాలు తెలుసుకున్న నిక్సన్ తన పంథా మార్చుకున్నారు. మేకప్ వేసుకొని, ఆకట్టుకునే వస్త్రధారణతో రెండో, మూడో డిబేట్లలో కెనడీపై విజయం సాధించారు. నాలుగో డిబేట్ టైగా ముగిసింది. అయినా తొలిగా పడ్డ ముద్రే ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నట్లు.. 1960 ఎన్నికల్లో తొలి డిబేట్‌లో గెలిచిన కెనడీనే అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ డిబేట్ జరిగిన పదహారేళ్ల తర్వాత 1976లో ఎన్నికల ప్రచారంలో మళ్లీ ప్రెసెడెన్షియల్ డిబేట్‌ను ప్రారంభించారు. అప్పటి దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గెరాల్డ్ ఫోర్డ్.. డెమొక్రాటిక్ అభ్యర్థి జిమ్మికార్టర్‌ల మధ్య టీవీ డిబేట్ జరిగింది. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రెసిడెన్షియల్ డిబేట్ కీలక కార్యక్రమంగా మారిపోయింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


తాజా వార్తలు (Latest News)
-
ముఖ్యమంత్రులు ఎవరు?
-
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు ఎమ్మెల్యే అయ్యాడు
-
తమిళనాడు వాసులకు తాడికొండలో ఓట్లు
-
Tanzania: టాంజానియాలో విరిగిపడ్డ కొండచరియలు.. 47 మంది మృతి
-
Bigg Boss Telugu 7: బిగ్‌బాస్ హౌస్ నుంచి గౌతమ్ కృష్ణ ఎలిమినేట్
-
Germany: మ్యూనిచ్ ఎయిర్‌పోర్టులో అల్లకల్లోలం.. మంచులో చిక్కుకుపోయిన విమానాలు..!