Rare blue lobster: నీలి రంగు పీతను చూశారా..!

సముద్రపు పీతలు ఎక్కువగా ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కానీ అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఓ మత్స్యకారుడికి అత్యంత అరుదైన నీలి రంగు

Published : 23 Jul 2021 01:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సముద్రపు పీతలు ఎక్కువగా ఎరుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. కానీ అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ఓ మత్స్యకారుడికి అత్యంత అరుదైన నీలి రంగు సముద్రపు పీత దొరికింది. ఎప్పటిలాగే గ్లౌసెస్టర్‌ ప్రాంతంలో చేపలు పట్టేందుకు వెళ్లిన టోబీ బర్న్‌హామ్‌ అనే మత్స్యకారుడు ముదురు నీలి రంగులో ఉన్న ఓ పీత తన వలలో కదలాడటం చూసి ఆశ్చర్యపోయాడు. అతడు ఆ పీతతో ఫొటోలు తీసుకొని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. అరుదైన పీతను చూసిన నెటిజన్లు ఆ ఫొటోలను విపరీతంగా షేర్‌ చేస్తుండటంతో ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

సాధారణంగా అరుదైన చేపలు, పీతలకు మార్కెట్‌లో భలే గిరాకీ ఉంటుంది. సీఫుడ్‌ ప్రియులు, పలు హోటళ్ల యాజమానులు ఎక్కువ ధర చెల్లించి మరీ వాటిని సొంతం చేసుకుంటారు. అయితే ఆ పీతతో ఫొటోలు తీసుకున్న అనంతరం టోబీ దాన్ని తిరిగి సముద్రంలోనే వదిలేశాడు. నీలి రంగు పీతలు చాలా అరుదైనవని, 20 లక్షల పీతల్లో ఒకటి మాత్రమే ఆ రంగులో ఉంటుందనీ అతడు చెప్పుకొచ్చాడు. అలాంటి అరుదైన జీవజాతులు మనుగడ సాగించాలంటే వాటిని తమ సహజ వాతావరణంలోనే వదిలేయడం మంచిదని తాను భావించినట్లు వివరించాడు. టోబీ చేసిన పనికి పలువురు నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. పర్యావరణంపై అతడికున్న ప్రేమను కొనియాడుతున్నారు.     

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని