Andhra News: రేపు సీఎంవోను ముట్టడించి తీరతాం: యూటీఎఫ్‌ నాయకులు

సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్‌ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసులు అడ్డుకున్నా చలో సీఎంవో జరిపి

Updated : 24 Apr 2022 12:47 IST

అమరావతి: సీపీఎస్‌ రద్దుపై సీఎం జగన్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సీపీఎస్‌ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పోలీసులు అడ్డుకున్నా చలో సీఎంవో కార్యక్రమం జరిపి తీరుతామంటున్నారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ యూటీఎఫ్‌ ‘చలో సీఎంవో’ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది.

శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి గృహనిర్బంధం చేశారు. ఆ జిల్లా వ్యాప్తంగా మొత్తం 200 మంది నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేయడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి బైక్‌ ర్యాలీలు చేపట్టిన యూటీఎఫ్‌ నాయకులు రేపు విజయవాడకు చేరుకోనున్నారు. రేపు కచ్చితంగా బైక్‌లపై సీఎంవోను ముట్టడిస్తామని యూటీఎఫ్‌ నాయకులు చెబుతున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని