iPhone13 Memes: ఐఫోన్‌-13 ఫన్నీ మీమ్స్‌ మాములుగా లేవుగా!

ఐఫోన్‌ మార్కెట్‌లో విడుదలైందంటే చాలు!  దాని ధరతో పాటు ఫీచర్స్‌ గురించి చర్చా కొనసాగుతూ ఉంటుంది. తాజాగా మార్కెట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌ని విడుదల చేసింది యాపిల్‌ కంపెనీ. అంతే.. ఐఫోన్‌12, ఐఫోన్13..ఈ  రెండింటిని పోలుస్తూ ఫన్నీ మీమ్స్‌ నెట్టింట సందడి చేశాయి. 12తో పోలిస్తే 13లో టెక్నికల్‌గా ఎన్నో మార్పులు చేసినప్పటికీ కెమెరా   

Published : 19 Sep 2021 08:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మొబైల్‌ ప్రియులకు మార్కెట్‌లో కొత్త ఫోన్‌ వచ్చిందంటే పండగే. అందులో ఇక ఐఫోన్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ విడుదల అవుతుందంటే ఇక చెప్పనక్కరలేదు. దాని ఫీచర్లు, ధర, అప్‌డేట్స్‌తో పాటు దాని డిజైన్‌ ఇలా కొన్నిరోజుల వరకు చర్చ కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా మార్కెట్‌లో ఐఫోన్‌ 13 సిరీస్‌ని విడుదల చేసింది యాపిల్‌ కంపెనీ. అంతే.. ఐఫోన్‌12, ఐఫోన్13.. ఈ రెండింటిని పోలుస్తూ ఫన్నీ మీమ్స్‌ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఐఫోన్‌ 12తో పోలిస్తే ఐఫోన్‌ 13లో టెక్నికల్‌గా ఎన్నో మార్పులు చేసినప్పటికీ కెమెరా వెనుక భాగం లుక్‌ ఒకేలా ఉండడంతో ఫన్నీ మీమ్‌లు ట్విటర్‌లో సందడి చేస్తున్నాయి.  

*  తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు శాఖ యాపిల్‌ 13 మీమ్‌ని ట్విటర్‌ వేదికగా పంచుకుంది. ‘ది యాపిల్ ఎవ్రీవన్స్‌ ఐ- యూపీ 112 మీ సొంత సూపర్ పవర్‌. వేగంగా, నమ్మకంగా పనిచేసే ఎమర్జన్సీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 112  అంటూ యాపిల్‌ బ్యాక్‌ కెమెరాలో పోలీసు వాహనాల చిత్రాలను ఐఫోన్‌ లెన్స్‌లో కూర్పు చేసి విడుదల చేసింది.

ఫన్నీ మార్కెటింగ్‌ స్ట్రాటజీ అందిపుచ్చుకుపోవడంలో ముందుండే ఫుడ్‌ డెలివరీ సంస్థ జోమాటో... ‘‘iphone12 vs iphone13’’ అంటూ బర్గర్స్‌, సాస్‌ని కెమెరా లెన్స్‌లో బంధించింది. 

*  ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం కేఎఫ్‌సీ ఇండియా కూడా తామేమి తక్కువ కాదని నిరూపించింది. ఐఫోన్‌ కెమెరాని ప్రతిబింబించేలా కెచఫ్స్‌ని బౌల్స్‌లో వేసిన్నట్టు చిత్రాన్ని ట్వీట్‌ చేసింది. 13 పీసెస్‌ హాట్‌ అండ్‌ క్రిప్సీ? అని ఉంచి ట్వీట్‌ చేసింది. 

* అంతేకాదు.. ఐఫోన్‌ 12, 13 కెమెరా లుక్స్‌ పరంగా ఒకటేలా ఉన్నాయంటూ పలు మీమ్స్‌ వైరల్‌ అయ్యాయి. వాటిపై మీరు లుక్కెయండి మరి!







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని