కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో శిశువు జననం

ఫ్లోరిడా: కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న ప్రపంచానికి ఇదో చల్లని కబురు. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు పెట్టింది. కొవిడ్ టీకా (మోడెర్నా) తీసుకున్న ఆరోగ్య కార్యకర్త ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఆమె 36 వారాల గర్భిణీగా.. 

Updated : 18 Mar 2021 05:04 IST

ఫ్లోరిడా: కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పోరాడుతున్న వేళ మానవాళికి తీపికబురు. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు పెట్టింది. కొవిడ్ టీకా (మోడెర్నా) తీసుకున్న ఆరోగ్య కార్యకర్త ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఫ్లోరిడాకు చెందిన ఒకామె 36 వారాల గర్భిణిగా ఉన్నప్పుడు కొవిడ్ టీకా తీసుకున్నారు. మూడు వారాల తర్వాత జనవరిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం శిశువు రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వాటిని డీఎన్‌ఏ పరీక్షకు పంపారు. ఈ పరిశోధనలో శిశువులో కొవిడ్ యాంటీబాడీస్‌ వృద్ధి చెందినట్లు గుర్తించామని అక్కడి శిశు వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ గిల్‌బర్ట్‌ పేర్కొన్నారు. కొవిడ్ టీకా తీసుకున్న గర్భిణిలోనే కాక ఆమెకు జన్మించిన బిడ్డలోనూ యాంటీ బాడీలు వృద్ధి చెందాయని గిల్‌బర్ట్‌ వివరించారు. ఇటువంటి ఘటన ప్రపంచంలో తొలిసారిగా జరిగిందని చెప్పారు. అయితే, ఈ కొవిడ్ యాంటీ బాడీలు శిశువుకు ఎంతకాలం రక్షణ కల్పిస్తాయన్నది తదుపరి అధ్యయనాల్లో తేలాల్సి ఉందని మరో వైద్యుడు డాక్టర్‌ చాడ్‌ రుడ్నిక్‌ తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని