Vaccination: జనవరి నుంచి పిల్లలకు కరోనా టీకా..!
బూస్టర్ డోసుపైనా రెండు వారాల్లో ప్రణాళిక రూపొందించే అవకాశం
దిల్లీ: దేశంలో కరోనా టీకా పంపిణీ నిర్విరామంగా కొనసాగుతున్నప్పటికీ.. పిల్లలకు ఇంకా కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అయితే దీనిపై కేంద్రం నిపుణులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతోంది. త్వరలోనే నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) కూడా దీనిపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఎన్‌టీఏజీఐ సమావేశం కానుంది. ఆ భేటీలో చిన్నారులకు టీకాతో పాటు పెద్దలకు బూస్టర్ డోసులపైనా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి పిల్లలకు టీకా పంపిణీ ప్రారంభించే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇతర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాధాన్యమిస్తూ వారికి టీకాలు వేసే అవకాశమున్నట్లు తెలిపాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలకు టీకా పంపిణీపై కేంద్రం దృష్టిపెట్టింది. మరోవైపు జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్-డి టీకాను 12-18 ఏళ్ల వయసు వారికి కూడా ఇవ్వొచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఈ టీకాకు కేంద్రం అత్యవసర అనుమతులిచ్చినప్పటికీ ఇంకా పంపిణీ ప్రారంభించలేదు.
ఇక దేశంలో బూస్టర్ డోసుల పంపిణీపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభించాయి. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ప్రస్తుతానికి బూస్టర్ డోసు అవసరం అంతగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
-
World News
Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
-
India News
Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
-
Sports News
Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
-
General News
Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
-
Politics News
Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల పెళ్లి సందడి.. టీజర్ చూశారా!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. స్టేజిపైనే కత్తిపోట్లు!
- Munugode: మునుగోడు కాల్పుల కేసు.. వివాహేతర సంబంధమే కారణం: ఎస్పీ
- The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Tejashwi Yadav: నీతీశ్ నిర్ణయం ‘భాజపాకు చెంపపెట్టు’