lockdown: వ్యాక్సినేషన్‌పై క్లారిటీ ఇచ్చిన డీహెచ్‌

తెలంగాణలో బుధవారం నుంచి నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) జి.శ్రీనివాసరావు స్పందించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో

Published : 12 May 2021 00:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలో బుధవారం నుంచి నుంచి లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంపై ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) జి.శ్రీనివాసరావు స్పందించారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో టీకా కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు వ్యాక్సినేషన్‌ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 45 ఏళ్లు పైబడి రెండో డోసు తీసుకునేవారికి టీకా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్‌ తీసుకున్న 4 వారాల తర్వాత, కొవిషీల్డ్‌ తీసుకున్న 6 వారాల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాలని ఆయన సూచించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని