yadadri: యాదాద్రి క్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

Updated : 13 Jan 2022 07:32 IST

యాదాద్రి భువనగిరి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. బాలాలయంలో(తూర్పు ద్వారం) లక్ష్మీ నారసింహుడు భక్తులకు వైకుంఠ ద్వారం నుంచి దర్శనమిచ్చారు. ఉదయం 6.49 గంటల నుంచి 9.00 గంటల వరకు అనుబంధ పాతగుట్ట ఆలయంలో స్వామి దర్శనమిస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను క్యూలైన్‌ ద్వారా అధికారులు అనుమతి ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ ధరిస్తేనే ఆలయంలోకి అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని