ఆ గ్రామం.. పిండివంటలకు ఫేమస్‌

పండుగలు, శుభకార్యాలు, వేసవి సెలవులు వచ్చాయంటే ఒకప్పుడు పిండి వంటల తయారీతోనే సందడి మొదలయ్యేది. ఉరుకులు, పరుగుల జీవితాల్లో ఇంటిల్లిపాదికి నెల రోజులకు సరిపడా పిండి వంటలు..

Published : 06 Dec 2020 02:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండుగలు, శుభకార్యాలు, వేసవి సెలవులు వచ్చాయంటే ఒకప్పుడు పిండి వంటల తయారీతోనే సందడి మొదలయ్యేది. ఉరుకులు, పరుగుల జీవితాల్లో ఇంటిల్లిపాదికి నెల రోజులకు సరిపడా పిండి వంటలు తయారు చేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ లోటు తీరేలా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామం సంప్రదాయ పిండివంటల రుచిని అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగే చాలా శుభకార్యాల్లో అతిథులను వేల్పూరు పిండివంటలు నోరూరిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వారు ఏడాదికోసారైనా వీటిని పంపించాలని ఇంట్లో వారిని కోరతారు. ఇంట్లో చేసినంత నాణ్యంగా అందుబాటు ధరలో ఉండటం వల్ల డిమాండ్‌ బాగుంటుందని దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.

పిండి వంటలు తయారు చేసే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ నాణ్యతపై అందరికీ నమ్మకం కలిగించేలా చేసిన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చిందని దుకాణదారులు చెబుతున్నారు. నాణ్యతతో పాటు రుచిగా ఉంటాయని అందుకే ఇక్కడ కొంటామని వినియోగదారులు తెలిపారు. వేల్పూరులో తయారయ్యే స్వీట్లతో తమ గ్రామానికి గుర్తింపు రావడం సంతోషంగా ఉందని స్థానికులు వివరించారు. 

ఇదీ చదవండి

హెల్మెట్‌ లేకుంటే పెట్రోల్‌ బంద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని