Balasubrahmanyam: ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించి ఎక్కడ పెట్టారో చూడండి: వంశీరామరాజు ఆవేదన

గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో ఏర్పాటు చేసిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తొలగించడంపై వంశీ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ వంశీ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 06 Oct 2022 01:36 IST

గుంటూరు: గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో ఏర్పాటు చేసిన అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తొలగించడంపై వంశీ  ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యను తెలుగు వారిగా ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కళాదర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలు విగ్రహాన్ని బుల్డోజర్‌తో తొలగించడం అమానుషం, హేయమని మండిపడ్డారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో పాటలకు పట్టాభిషేకం చేసిన మహా గాయకుడన్నారు. పాటకు ఎల్లలు లేవంటూ విదేశాల్లో సైతం ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనకీర్తి ఆయనకే దక్కుతుందని కొనియాడారు. అలాంటి మహా గాయకుడి విగ్రహాన్ని తొలగించడం ఆయనకు జరిగిన అవమానంగానే భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా తొలగించిన విగ్రహాన్ని మరుగుదొడ్డి పక్కన ఉంచడమంటే ఆ సరస్వతీ దేవిని తిరస్కరించడమేనన్నారు. ఈ వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి తగిన చర్యలు తీసుకుని కళాకారులు, కళాభిమానులకు తగిన గౌరవం లభించేలా చూడాలని కళాసంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయని వంశీ రామరాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని