Medaram 2022: వనం వదిలి జనం మధ్యకు సమ్మక్క తల్లి

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న వనదేవత సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గౌరవ సూచికంగా ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. డప్పు వాయిద్యాల...

Updated : 17 Feb 2022 22:54 IST

మేడారం: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న వనదేవత సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకుంది. సమ్మక్కకు స్వాగతం పలుకుతూ గౌరవ సూచికంగా ములుగు జిల్లా ఎస్పీ గాల్లోకి కాల్పులు జరిపారు. డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమ్మక్కను మేడారం తీసుకొచ్చారు. సమ్మక్క వచ్చే మార్గంలో పొర్లు దండాలు పెడుతూ, జయజయ ధ్వానాలతో భక్తులు తల్లికి స్వాగతం పలికారు. అమ్మవారి రాక, శివసత్తుల పూనకాలతో భక్తులు తన్మయత్వం చెందారు. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు మేడారం గద్దెలపై కొలువుదీరినట్లు అయింది. సమ్మక్క-సారలమ్మను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అమ్మ గద్దెపైకి చేరే అద్భుతాన్ని కనులారా వీక్షించిన భక్తకోటి పరవశించిపోయారు. సమ్మక్క తల్లి గద్దెల వద్దకు చేరుకోవడంతో కాసేపు దర్శనాలు నిలిపివేశారు. పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం దర్శనాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రేపు, ఎల్లుండి భక్తుల దర్శనార్థం వనదేవతలు గద్దెలపైనే ఉంటారు. ఎల్లుండి సాయంత్రం దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని