Guntur: సోషల్‌ మీడియా పోస్టింగ్‌ కేసు.. వరప్రసాద్‌కు బెయిల్‌

సోషల్‌ మీడియా పోస్టింగ్‌ కేసులో విజయవాడకు చెందిన వరప్రసాద్‌కు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు.

Published : 28 Sep 2023 17:50 IST

గుంటూరు: సోషల్‌ మీడియా పోస్టింగ్‌ కేసులో విజయవాడకు చెందిన వరప్రసాద్‌కు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. వరప్రసాద్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్టింగ్‌ పై గుంటూరు నగరంపాలెం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో వరప్రసాద్‌ను అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు  ఇవాళ కోర్టులో హాజరుపర్చారు. పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయమూర్తి.. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని