జనవరి 13 వరకూ ఆస్పత్రిలోనే వరవరరావు

విరసం నేత, కవి వరవరరావు జనవరి 13 వరకూ ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నట్లు బొంబాయి హైకోర్టు గురువారం తెలిపింది. జస్టిస్‌ ఎస్‌ షిండే, జస్టిస్‌ ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది.

Updated : 08 Jan 2021 04:31 IST

ఆదేశించిన బొంబాయి హైకోర్టు

ముంబయి: విరసం నేత, కవి వరవరరావు జనవరి 13 వరకూ ఆస్పత్రిలోనే చికిత్స పొందవచ్చని బొంబాయి హైకోర్టు ఆదేశాలు వెలువరించింది. జస్టిస్‌ ఎస్‌ షిండే, జస్టిస్‌ ఎంఎస్‌ కార్నిక్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది. 81 సంవత్సరాల వరవరరావుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన్ను కేంద్ర దర్యాప్తు బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత నవంబరులో ఆయనకున్న అనారోగ్యం దృష్ట్యా నానావతి ఆస్పత్రిలో చేర్పించారు. వరవరరావు భార్య హేమలత బెయిల్‌ కోరుతూ వేసిన పిటిషన్‌ను జనవరి 13న విచారిస్తామని హైకోర్టు తెలిపింది. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆరోగ్యంపై తాజా నివేదికను కోర్టుకు సమర్పించింది. ఆయన ఆరోగ్యం గతంతో పోలిస్తే కాస్త మెరుగైందని ఆ నివేదికలో పేర్కొంది.

ఇవీ చదవండి..

ట్రంప్‌కు సోషల్‌ షాక్‌..

బైడెన్‌ ఎన్నిక్‌.. కిమ్‌ కీలక నిర్ణయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని