Basara: వసంత పంచమి వేళ బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది.

Updated : 05 Feb 2022 09:52 IST

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని తెలంగాణలోని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు దీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఈ ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం,పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని