AP High Court: ‘నాట్‌ బిఫోర్‌ మీ’.. వాసుదేవరెడ్డి పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకొన్న జడ్జి

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి వైదొలిగారు.

Published : 25 Jun 2024 13:45 IST

అమరావతి: ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాస్‌రెడ్డి వైదొలిగారు. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అంటూ ఆయన తప్పుకొన్నారు. ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. వైకాపా హయాంలో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. కీలక డాక్యుమెంట్లను మాయం చేశారనే ఆరోపణలు రావడంతో సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని