AP News: కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేం: వెంకయ్య

కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నాడు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఈరోజు సాయంత్రం స్వర్ణభారత్‌ ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల

Updated : 30 Oct 2021 19:07 IST

విజయవాడ: కరోనా వేళ ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతుల కృషి మరచిపోలేమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా ఆత్కూరులో ఈరోజు సాయంత్రం స్వర్ణభారత్‌ ట్రస్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ఐ.వి.సుబ్బారావు రైతు నేస్తం పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం మాసపత్రిక  ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ... జల సంరక్షణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరముందన్నారు. వర్షపునీటి నిల్వకు ప్రతి రైతు పొలంలోనే గుంతలు తవ్వాలని సూచించారు. నీరు వృథాగా సముద్రంలోకి వెళ్లకుండా చూడాలన్నారు.

‘‘మన దేశానికి అనాదిగా వ్యవసాయమే వెన్నెముక. సాగు ఖర్చులను రైతులు బాగా తగ్గించుకోవాలి. వ్యవసాయం అనేది ఎప్పుడూ పర్యావరణ హితంగా ఉండాలి. రసాయనాలు వచ్చాక భూమి, మనిషి ఆరోగ్యం చెడిపోయాయి. రైతులు క్రమంగా ప్రకృతి సేద్యంపై దృష్టి పెడుతున్నారు. రసాయనాలు వాడని పంటలకు మంచి ధర వస్తోంది. ప్రకృతి సాగు ద్వారా భూసారం పెంచుకుంటున్నారు. పొలం గట్లపై లాభాలిచ్చే వివిధ రకాల చెట్లు పెంచాలి’’ అని వెంకయ్యనాయుడు సూచించారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రైతు నేస్తం’ లాభసాటి వ్యవసాయ ఆధారిత పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని