
Updated : 13 Nov 2021 17:24 IST
AP news: దివ్యాంగులను ప్రోత్సహించండి: వెంకయ్యనాయుడు
నెల్లూరు: దివ్యాంగుల పట్ల దయ, సానుభూతి చూపడంతో పాటు వారిని ప్రోత్సహించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని దివ్యాంగుల ప్రాంతీయ శిక్షణాకేంద్రాన్ని ఆయన సందర్శించారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి, వారిలో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటే సాధికారత సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు వెంకయ్యనాయుడు బహుబతులు అందజేశారు.
ఇవీ చదవండి
Tags :