ఎన్నికలపై మేం అలా అనలేదు: వెంకట్రామిరెడ్డి 

ఎన్నికల్లో పాల్గొనబోమని తామెప్పుడూ చెప్పలేదని, ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించాలని మాత్రమే కోరినట్టు ప్రభుత్వ........

Published : 25 Jan 2021 17:01 IST

అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనబోమని తామెప్పుడూ చెప్పలేదని, ఆరోగ్యం సరిగా లేని ఉద్యోగులను మినహాయించాలని మాత్రమే కోరినట్టు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల విధులకు సహకరించే వారితో నిర్వహించుకోవచ్చన్నారు. వ్యాక్సినేషన్‌ పూర్తయ్యే వరకు గోవాలో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని, ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలన్నారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉద్యోగులందరూ ఎన్నికల విధుల్లో పాల్గొనబోరని తాము అనడంలేదన్నారు. వయో భారంతో అనేక మంది కరోనాకు భయపడుతున్నారని చెప్పారు. ఎన్నికలను బహిష్కరించాలని, పాల్గొనబోమని తాము చెప్పడంలేదన్నారు. 

ఇదీ చదవండి..

ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని