Venkaiah Naidu: భారత్‌ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ: వెంకయ్య

మన సంస్కృతి, వారసత్వం గొప్పదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌ ఎదుగుదల చూసి

Updated : 02 Apr 2022 11:28 IST

హైదరాబాద్‌: మన సంస్కృతి, వారసత్వం గొప్పదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ అని చెప్పారు. మన ప్రగతిని అడ్డుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతారన్నారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వేటికి ప్రాధాన్యం ఇస్తున్నామో మీడియా ఆలోచించాలన్నారు. ముచింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో ఉగాది వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడారు.

‘‘సాంఘిక వివక్ష పాటించకూడదని అందరూ ప్రతిజ్ఞ చేయాలి. చట్టసభల్లో సభ్యుల వ్యాఖ్యలు హుందాగా ఉండాలి. కులం కంటే గుణం మిన్న.. అనే దాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మన ఉనికి కాపాడుకునేందుకు ఎల్లవేళలా ప్రయత్నించాలి. ఇంట్లో, వీధిలో, బడిలో, గుడిలో మాతృభాషలోనే మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. అమ్మభాష రాకుంటే అంతకు మించిన దరిద్రం మరొకటి లేదు. మన సంస్కృతి, సంప్రదాయం చాలా గొప్పవి. సంప్రదాయ దుస్తులు, ఆహారం.. పెద్దలు మనకిచ్చిన ఆస్తి. వాతావరణానికి అనుకూలమైన దుస్తులు వేసుకోవాలి, ఆహారం తీసుకోవాలి’’ అని వెంకయ్య అన్నారు. వేడుకల్లో కామినేని శ్రీనివాస్‌, చిగురుపాటి ఉమాదేవి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఓయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాగి కమలాకర శర్మ పంచాంగ శ్రవణం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని