‘మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్లాలి’

మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Updated : 27 Mar 2021 14:01 IST

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన నూకల నరోత్తమరెడ్డి శత జయంత్యుత్సవాల్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..  సమాజ శ్రేయస్సు కోసం నూకల కృషి చేశారని కొనియాడారు. ఆయన సంగీతంలోనూ ప్రావీణ్యం పొందారని గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారని వెంకయ్యనాయుడు తెలిపారు. 

‘‘ మన సంస్కృతి, సంప్రదాయాన్ని, చరిత్రను విస్మరిస్తున్నాం. ఇది మంచి పరిణామం కాదు. జర్నలిస్టులు విలువలు పాటించేలా పని చేయాలి. పత్రికలు సత్యానికి దగ్గరగా.. సంచలనాలకు దూరంగా ఉండాలి. సాంకేతికతపై యువత దృష్టి పెట్టాలి. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా మన నూతన విద్యావిధానం ఉండాలి. యువతను దేశ సంపదగా భావించి ముందుకెళ్లాలి. పార్లమెంట్‌కు 10 శాతం సభ్యులు కూడా హాజరు కావట్లేదు. ప్రజలు ఎందుకు సభలకు పంపుతున్నారో ఆలోచించాలి. రాజ్యసభలో కూడా క్రమశిక్షణ గురించి చెప్పడం బాధగా అనిపిస్తోంది. రాజ్యసభలో మాతృభాషలో మాట్లాడేందుకు ప్రోత్సాహం అందిస్తున్నాం. గతంలో జనం శ్రేయస్సు కోసం సంఘాలు పెట్టేవారు. . నేడు స్వప్రయోజనాల కోసం పెడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కొవిడ్‌ ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు’’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని