
హక్కులు పొందాలంటే బాధ్యతగా ప్రవర్తించాలి: వెంకయ్య నాయుడు
విశాఖపట్నం: రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పొందాలంటే బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. సంజీవయ్య శతజయంతి ఏడాది సందర్భంగా నివాళులర్పించారు. న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.సూర్యప్రకాశ్ సంకలనం చేసిన ‘భారత స్వాతంత్ర్యపోరాటంలో అమరవీరులు’ అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతి మనిషిలో మార్పు తప్పని సరిగా రావాలని, కులం, మతం, ప్రాంతం, లింగ, వయో భేదం లేకుండా అందరూ సమష్ఠిగా దేశ పురోగతికి కృషి చేసినప్పుడే స్వాతంత్ర్య ఫలాలను సంపూర్ణంగా అందుకోగలమని అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.