Andhra News: నెల్లూరులో ఆకాశవాణి నూతన టవర్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

నగరంలోని ఆకాశావాణి రేడియో కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 మీటర్ల టవర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.

Updated : 27 Apr 2022 16:15 IST

నెల్లూరు: నగరంలోని ఆకాశావాణి రేడియో కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 మీటర్ల టవర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. గతంలో ఉన్న ఫ్రీక్వెన్సీ పరిధిని పెంచుతూ ఏర్పాటు చేసిన టవర్‌ను ఉపరాష్ట్రపతి జాతికి అంకితం చేశారు. అనంతరం ఆకాశవాణి స్టూడియోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ 100 మీటర్ల టవర్‌ను ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని.. ఈ కేంద్రం ఏర్పాటులో తాను కూడా భాగస్వాముడిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. విదేశాలల్లో మన సంస్కృతికి మంచి పేరుందని.. మన యాస, సంప్రదాయాలను ముందు తరాలకు అందించడం మన బాధ్యతన్నారు. ఇక్కడి యాస, భాషలను పరిశీలించి కార్యక్రమాలను చేపట్టాల్సిన బాధ్యత రేడియో కేంద్రం అధికారులపై ఉందని చెప్పారు. వరదల సమయంలో ఆకాశవాణి కేంద్రం అందించిన సేవలు అభినందనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు