Monkey: తాగుబోతు కోతి.. మందు కనిపిస్తే ఆగేదేలే!

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాయ్‌బరేలీ జిల్లాలో ఓ కోతి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. మద్యానికి అలవాటు పడిన ఆ కోతి షాపుల్లో దూరి మద్యం ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక మద్యం విక్రేతలు ఫిర్యాదు చేస్తున్నారు.

Published : 02 Nov 2022 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మద్యం కనిపిస్తే చాలు దానికి నాలుక లాగేస్తుంది. ఎవరి చేతుల్లోనైనా మద్యం కనిపిస్తే గుంజేసుకుంటుంది. అయినా ‘ఎవరో ఇచ్చేదేంటి.. నేనే వెళ్తా.. ఎవడాపుతాడో చూస్తా’ అంటూ మద్యం దుకాణాల్లోకి నేరుగా చొరబడి మందు బాటిళ్లు ఎత్తుకెళ్లిపోతోంది. ఎంచక్కా మందుకొట్టి నిద్ర పోతోంది. ఈ ఉపోద్ఘాతమంతా ఓ కోతి గురించి అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే మరి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో రాయ్‌బరేలీ జిల్లాలో ఓ కోతి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. మద్యానికి అలవాటు పడిన ఆ కోతి షాపుల్లో దూరి మద్యం ఎత్తుకెళ్లిపోతోందంటూ స్థానిక మద్యం విక్రేతలు ఫిర్యాదు చేస్తున్నారు. మద్యం తాగుతూ ఎవరైనా కనిపిస్తే వారి దగ్గర నుంచి లాక్కుని పారిపోతోందని స్థానికులు చెబుతున్నారు. అడ్డుకోవడానికి చూస్తే ఎదురు తిరుగుతుండడంతో అక్కడి మద్యం విక్రేతలు కోతి అంటే భయపడిపోతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీ శాఖ అధికారులతో కలిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. మొత్తానికి ఈ తాగుబోతి వానరం అక్కడి వారికి చుక్కలు చూపిస్తోంది. అన్నట్లు ఎక్కడి నుంచి ఎత్తుకెళ్లిందో తెలీదు గానీ.. బీరు బాటిల్‌ను లేపేస్తున్న వీడియో మాత్రం వైరల్‌గా మారింది. చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని