GHMC: నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన కమిషనర్‌

సరైన ఆధారాలు లేకుండానే జారీ చేసిన 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను బల్దియా నిలిపివేయటం సంచలనంగా మారింది. నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కమార్‌ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. 

Updated : 07 Mar 2023 17:37 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల అంశం కలకలం సృష్టిస్తోంది. సరైన ఆధారాలు లేకుండానే జారీ చేసిన 31వేల జనన, మరణ ధ్రువపత్రాలను బల్దియా నిలిపివేయటం సంచలనంగా మారింది. అధికారుల చర్యలు, ప్రభుత్వ ఉదాసీనతతో జనన, మరణ ధ్రువపత్రాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో వ్యాపారంగా మారాయని విపక్షాలు మండిపడుతున్నాయి. మరో వైపు వేలాది జనన, మరణ ధ్రువపత్రాలు బ్లాక్‌లో పెట్టడంతో అందులో సరైన ధ్రువపత్రాలు పెట్టిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కమార్‌ విజిలెన్స్‌  విచారణకు ఆదేశించారు. ఇవాళ సెలవు కావడంతో రేపటి నుంచి విచారణ చేపట్టనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఏవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ జంట నగరాల్లో జన్మిస్తున్న, మరణించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారుల పరిధిలో హెల్త్‌ అసిస్టెంట్లు నమోదు చేయడం, ధ్రువపత్రాలు జారీ చేయడం చేస్తుంటారు. అయితే, వీరు పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయకపోవడంతో అసలు మొదలైంది. బ్లాక్‌లో పెట్టిన ధ్రువీకరణ పత్రాల వారు సపోర్టింగ్‌ డాక్యుమెంట్‌లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అన్‌ బ్లాక్‌ చేసి వెంటనే ధ్రువీకరణ పత్రాలు అందిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని