Vijay Mallya: ఎట్టకేలకు అమ్ముడుపోయిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌.. ఎంతకు అంటే?

బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌ ఎట్టకేలకు అమ్ముడుపోయింది. ముంబయి విమానాశ్రయానికి సమీపంలోని ఈ భవనాన్ని తాజాగా హైదరాబాద్‌కు చెందిన

Published : 15 Aug 2021 02:06 IST

ముంబయి: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌ ఎట్టకేలకు అమ్ముడుపోయింది. ముంబయి విమానాశ్రయానికి సమీపంలోని ఈ భవనాన్ని తాజాగా హైదరాబాద్‌కు చెందిన సాటర్న్‌ రియల్టర్స్‌ రూ.52.25 కోట్లకు దక్కించుకుంది. బెంగళూరులోని రుణ వసూలు ట్రైబ్యూనల్‌ ఈ ఆస్తి విక్రయానికి సంబంధించి 2016 నుంచి వేలం వేస్తూ వస్తోంది. ఇప్పటికీ ఎనిమిది సార్లు వేలం వేయగా అన్ని  విఫలమయ్యాయి. తాజాగా తొమ్మిదో వేలంలో ఈ ఖరీదైన ఇల్లు అమ్ముడుపోయింది. మొదటి వేలంలో రిజర్వ్ ధర రూ.135 కోట్లుగా నిర్ణయించగా.. 2019 నవంబర్‌లో చేపట్టిన ఎనిమిదో వేలం నాటికి ఇది రూ.54 కోట్లకు చేరింది. అయినా కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రూ.52 కోట్లుగా నిర్ణయించగా.. రూ.52.25 కోట్లకు సాటర్న్‌ రియల్టర్స్‌ కొనుగోలు చేసింది. గతంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ భవనం వాస్తవ విలువ సుమారు రూ.150 కోట్లు కావడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని