
సిబ్బంది నిర్లక్ష్యం.. పరీక్ష చేయకుండానే పాజిటివ్
హైదరాబాద్: కరోనా పరీక్ష చేయకుండానే ఓ వ్యక్తికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు రాసిన వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వాసుత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరి చర్చనీయాంశమవుతోంది. చంద్రయ్య అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ లక్షణాలతో పరిగి ఆస్పత్రిలో చేరారు. బాధితుడికి పరీక్ష చేయకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధరించిన వైద్యులు హైదరాబాద్ కింగ్‌కోఠి ఆస్పత్రికి రిఫర్ చేశారు. కొవిడ్ ఉండటంతో కింగ్‌కోఠి ఆస్పత్రి వైద్యులు చంద్రయ్యను చేర్చుకోడానికి నిరాకరించారు.
పలు ఆస్పత్రులు తిరిగినా చంద్రయ్యను చేర్చుకోలేదని.. చివరకు గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స అందిస్తున్నారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్‌కు చికిత్స అందించకుండా కరోనా వైద్యం చేస్తుండటంతో చంద్రయ్యను ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. కాగా.. అప్పటికే కొవిడ్ పరీక్ష చేయించుకున్నామని చెప్పడంతోనే కరోనా పాజిటివ్‌గా రాశామని పరిగి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.