Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో ఎంఐపీ ఏర్పాటుపై ప్రజాగ్రహం

కాకినాడ సెజ్‌లో మల్టీ ప్రాడెక్ట్స్‌ ఇండస్ట్రియల్‌ పార్కు(ఎంఐపీ) ఏర్పాటును కె.పెరుమాళ్లపురం, పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు.

Updated : 06 Jun 2023 12:58 IST

తొండంగి: కాకినాడ సెజ్‌లో మల్టీ ప్రాడెక్ట్స్‌ ఇండస్ట్రియల్‌ పార్కు(ఎంఐపీ) ఏర్పాటును కె.పెరుమాళ్లపురం, పరిసర గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్‌ పార్కు వివరాలను గ్రామస్థులకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గ్రామస్థులు దాన్ని వ్యతిరేకిస్తూ ఒక్కసారిగా నిరసనకు దిగారు. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుమానాలు, అపోహలు ఉంటే తెలపాలని కలెక్టర్‌ కృతికా శుక్లా కోరినప్పటికీ గ్రామస్థులు వినలేదు. దీంతో పోలీసులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ప్రజాభిప్రాయసేకరణ సభకు ఎ.వి.నగరం, కె.పెరుమాళ్లపురం, తొండంగి, కోదాడ, రమణక్కపేట, మూలపేటకు గ్రామాల ప్రజలు హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో 4,072 ఎకరాల్లో రూ.2,500కోట్లతో ఎంఐపీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని