AP News: చెరువుకు గండికొట్టారంటూ గ్రామస్థుల ఆందోళన

అధికారులు చెరువుకు గండికొట్టడంతో గ్రామంలో వరద నీరు వచ్చిందని గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. 

Updated : 26 Nov 2021 16:49 IST

లాఠీఛార్జి చేయడాన్ని నిరసిస్తూ అధికారులను ప్రశ్నిస్తున్న మహిళ

తిరుపతి: అధికారులు చెరువుకు గండికొట్టడంతో గ్రామంలో వరద నీరు వచ్చిందని గ్రామస్థులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈసంఘటన తిరుపతి గ్రామీణ మండలం పూతలపట్టు వద్ద గురువారం రాత్రి జరిగింది. పేరూరు చెరువుకు అధికారులు గండి కొట్టడంతో గ్రామంలోకి నీరు వచ్చిందని పాతకాల్వ గ్రామస్థులు పూతలపట్టు -నాయుడుపేట జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీంతో రహదారిపై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్‌ చేశారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాలు పలువురికి గాయాలు  అయ్యాయి. విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గ్రామస్థులు ఆందోళన చేస్తున్న ప్రాంతానికి  చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే తమ వద్దకు రావద్దంటూ గ్రామస్థులు నినాదాలు చేశారు.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అడ్డుకున్న గ్రామస్థులు

  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని