Anantapur: విద్యుత్ శాఖ సిబ్బందిపై గ్రామస్థుల దాడి..!

అనంతపురం జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్లు వివాదాస్పదంగా మారాయి. గుంతకల్లు మండలం శంకరబండ గ్రామంలో

Published : 26 Feb 2022 23:26 IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో విద్యుత్ బకాయిల వసూళ్లు వివాదాస్పదంగా మారాయి. గుంతకల్లు మండలం శంకరబండ గ్రామంలో విద్యుత్ బిల్లుల వసూలు కోసం వెళ్లిన సిబ్బందిపై గ్రామస్థులు తిరగబడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతోపాటు.. ఫోన్ చేసినా స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో బిల్లులు చెల్లించకపోతే.. గ్రామం మెుత్తానికి విద్యుత్ ఎలా నిలిపివేస్తారంటూ ఉద్యోగులను నిర్బంధించారు. రైతులు, విద్యుత్ ఉద్యోగుల వివాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకొని సిబ్బందిని విడిపించారు. తమపై దాడి చేశారంటూ గ్రామస్థులపై ఉద్యోగులు కేసు పెట్టారు. అకాల విద్యుత్‌ కోతలతో పంటకు నీరు పెట్టుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని అన్నదాతలు వాపోయారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని