కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి 

చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో  భాగంగా వినాయక చవితి వేడుకను ఘనంగా నిర్వహించారు..

Updated : 22 Aug 2020 15:02 IST

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో  భాగంగా వినాయక చవితి వేడుకను ఘనంగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారిని సర్వాలంకృతుడ్ని చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. కరోనా నేపథ్యంలో మాస్కులను ధరించిన భక్తలను మాత్రమే దర్శనానికి అనుమతించారు. 

క్యూలైన్లలో సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలను కొనసాగించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. చవితి ఉత్సవాల్లో లో భాగంగా స్వామివారికి వినాయక వ్రతకల్పం చేశారు. భక్తులకు కావాల్సిన వసతులను ఆలయ ఈవో ఏ.వెంకటేశ్‌, ఈఈ వెంకటనారాయణ పర్యవేక్షించారు. 

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి వెల్లంపల్లి
వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యేలు ఎమ్‌ఎస్‌.బాబు,  పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్పలతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. పట్టువస్త్రాలను స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా  కలెక్టర్‌ నారాయణ్‌భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌, డీఎస్పీ ఈశ్వరరెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని