Railway jobs: 3లక్షల రైల్వే ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయండి: వినోద్‌ కుమార్‌

రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న 3లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 13 Dec 2022 01:32 IST

హైదరాబాద్‌: రైల్వేలో ఖాళీగా ఉన్న 3లక్షలకు పైగా ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైల్వేలోని ఉద్యోగాల ఖాళీల వివరాలపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిపూర్వక సమాధానం ఇచ్చారని తెలిపారు. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో వివిధ కేటగిరీల్లో 17,134 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారన్నారు. రైల్వే ఉద్యోగాల భర్తీని తెలంగాణ నుంచి ఎన్నికైన నలుగురు భాజపా ఎంపీలు ఎందుకు పట్టించుకోవడం లేదని వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వేతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని