Viral: అమెరికా తీరంలో రంగురంగుల మత్స్యం

వెండి, నారింజ రంగులు కలబోసిన భారీ చేపను మీరెప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి ఓ చేప అమెరికాలోని ఒరెగాన్‌ తీరానికి కొట్టుకొచ్చింది.

Published : 23 Jul 2021 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెండి, నారింజ రంగులు కలబోసిన భారీ చేపను మీరెప్పుడైనా చూశారా? తాజాగా అలాంటి ఓ చేప అమెరికాలోని ఒరెగాన్‌ తీరానికి కొట్టుకొచ్చింది. దాని బరువు 45 కిలోలు. ఒపాగా పిలిచే ఆ చేప ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దీనిని మూన్‌ ఫిష్‌గా కూడా పిలుస్తారు. మూడున్నర అడుగుల పొడవున్న ఈ చేప వెండి, ప్రకాశవంతమైన నారింజ రంగుల్లో.. శరీరంపై తెల్లని మచ్చలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీని విచిత్రమైన రంగుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సాధారణంగా ఈ చేపలు ఆరు అడుగుల పొడవుతో సుమారు 270 కిలోల బరువు వరకు పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్టమండల, సమశీతోష్ణ జలాల్లో.. సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. అయితే లోతైన సముద్ర జలాల్లో ఉండే చేపలు తీరానికి కొట్టుకొనిరావడం ఆందోళన కలిగించే అంశంగా పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో సముద్ర జాలాలు వేడెక్కడంతో ఈ చేపలు చల్లని నీటి కోసం ఉత్తర దిక్కుకు వలస వెళ్తున్నట్లుగా వారు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని