Viral Photo: ఈ పిల్లాడి పనికి సోషల్‌ మీడియా ఫిదా.. వైరల్‌గా మారిన ఫొటో..

ఇతరులపై జాలి,దయ చూపించడానికి వయసుతో సంబంధంలేదని మరోసారి రుజువు చేశాడో పిల్లాడు. తను చేసిన పనితో అందరి హృదయాలను గెలుచుకుంటున్నాడు.

Published : 15 Apr 2022 23:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతరులపై జాలి, దయ చూపించడానికి వయసుతో సంబంధం లేదని రుజువు చేశాడో పిల్లాడు. తను చేసిన పనితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తన బాటిల్‌లోని నీటిని రోడ్డు మీద ఉన్న వృద్ధులకు అందిస్తూ ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఓ ఐఏయస్‌ అధికారి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. చిన్నప్పటి నుంచే దయాగుణం అలవాటు చేసుకుంటే పెద్దయ్యాక ప్రపంచాన్ని మార్చే శక్తి వస్తుందంటూ సందేశం ఇచ్చారు. ఈ ఫొటోకు ‘దయ సహజసిద్ధంగా వస్తుంది. ద్వేషం ఎవరైనా నేర్పితేనే అలవాటు అవుతుంది’ అని క్యాప్షన్‌ పెట్టారు. షేర్‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఫొటోకు కొన్ని వేలల్లో లైక్స్‌, రీట్వీట్‌లు వచ్చాయి. దీనిని చూసిన వీక్షకులు మానవత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ, ఇలాంటి మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పాలంటూ వారి భావాలను కామెంట్స్‌లో పంచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని