Viral Video:నేస్తమా.. నన్ను వదిలి వెళ్లిపోతున్నావా.. వైరల్ అవుతున్న నెమలి వీడియో

మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని మనలో చాలామంది వినే ఉంటారు.  పిల్లలు కాసేపు కనిపించకపోతే అల్లలాడిపోవడం, ఏదైనా జంతువు నుంచి అపాయం తలెత్తితే దానితో పోరాడి పిల్లల్ని కాపాడుకోవడం

Updated : 07 Jan 2022 01:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులు భావోద్వేగాలు ప్రదర్శిస్తాయని మనలో చాలామంది వినే ఉంటారు.  పిల్లలు కాసేపు కనిపించకపోతే అల్లలాడిపోవడం, ఏదైనా జంతువు నుంచి అపాయం తలెత్తితే దానితో పోరాడి పిల్లల్ని కాపాడుకోవడం, యాజమాని పట్ల విశ్వాసం ప్రదర్శించడం వంటివి కూడా ఈ కోవలోకే వస్తాయి. ఓ నెమలి కూడా ఈ విధంగా భావోద్వేగాన్ని ప్రదర్శించింది. ఇన్నాళ్లు తనతో ఉన్న నెమలి అనుహ్యంగా మరణించడంతో ఆ పక్షి అల్లలాడింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. 

రాజస్థాన్‌లోని కుచేర ప్రాంతంలో రామస్వరూప్ బిష్ణోయ్ అనే వ్యక్తి ఇంటి వద్ద రెండు నెమళ్లు ఉండేవి. వాటికి ఆయన ప్రతిరోజూ తిండిగింజలు వేస్తుండేవాడు. అలా నాలుగేళ్లు గడిచిపోయింది. అయితే అందులో ఓ నెమలి ఈ మధ్యే మృతి చెందింది. దీంతో ఆయన ఇద్దరు వ్యక్తులను పిలిపించి ఆ నెమలిని గోతి తీసి పూడ్చమని చెప్పాడు. నెమలి కళేబేరాన్ని పూడ్చడానికి తీసుకువెళ్తున్న క్రమంలో.. ఇన్నాళ్లు దానితో ఉన్న మరో నెమలి వారి వెంటసాగింది. నెమలిని ఖననం చేసేవరకు అక్కడే ఉందని రామస్వరూప్ పేర్కొన్నాడు. నెమలి పరుగులు తీసిన వీడియోను  2 లక్షల మందికిపైగా వీక్షించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని