Uttarakhand: వరదల్లో చిక్కుకొన్న వారిని పోలీసులు ఎలా కాపాడారో చూడండి!

వరదల్లో చిక్కుకొన్న నలుగురిని ఐటీబీపీ సిబ్బంది ఎలా కాపాడారో ఈ వీడియోలో చూపించారు

Published : 03 Sep 2021 02:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేవభూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో మిలాం గ్రామ సమీపంలో 12,000 అడుగుల ఎత్తులో నలుగురు స్థానికులు చిక్కుకుపోయారు. వారిని ఇండో-టిబెట్‌ సరిహద్దు పోలీసులు (ఐటీబీపీ) సురక్షితంగా కాపాడారు. తాజాగా పోలీసులు చేపట్టిన సహాయక చర్యల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వరదల్లో చిక్కుకొన్న నలుగురిని ఐటీబీపీ సిబ్బంది ఎలా కాపాడారో ఈ వీడియోలో చూపించారు. వీరిలో ముగ్గురు మగవారితో పాటు ఒక మహిళ కూడా ఉంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదికి అవతలివైపు వారు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వారికి తాడు అందించి ఒకరి తర్వాత ఒకరిని సురక్షితంగా పోలీసులు కాపాడారు. కొండ ప్రాంతాలకు మూలికలను సేకరించడానికి వారు వెళ్లారని..ఆ సమయంలో ఒక్కసారిగా వరదలు పోటెత్తాయని పోలీసు అధికారి వివేక్‌ పాండే వివరించారు. దీంతో నదిని దాటలేక వారు 7గంటలకు పైగా అక్కడే నిరీక్షించారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని