TTD: రేపు శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్ల విడుదల

శ్రీవారి వర్చువల్‌ సేవా టికెట్ల దర్శన కోటాను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

Published : 09 Jan 2023 18:23 IST

తిరుమల: రేపు ఉదయం 9 గంటలకు శ్రీవారి వర్చువల్‌ సేవా (Virtual Seva) టికెట్ల దర్శన కోటాను విడుదల చేయనున్నట్లు తితిదే (TTD) వెల్లడించింది. ఈ నెల 12 నుంచి ఆలయంలో జరిగే వర్చువల్‌ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల కోసం టికెట్లు విడుదల చేసినట్లు తితిదే పేర్కొంది. బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22-28 మధ్య టికెట్లు విడుదల చేయడం లేదని తితిదే వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని