విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన.. నిలిచిపోయిన రూ.వేల కోట్ల లావాదేవీలు

విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌కు

Published : 24 Sep 2022 14:33 IST

విశాఖ: విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. 20 ఏళ్ల క్రితం విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌కు భూములిచ్చిన సమయంలో 60 గజాల ఇంటి స్థలం, రూ.లక్ష పరిహారం, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు పరచలేదని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కంటైనర్‌ టెర్మినల్‌కు వెళ్లే మార్గంలో మత్స్యకారులు నిరసన తెలిపారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.వేల కోట్ల లావాదేవీల ఎగుమతులు, దిగుమతులు ఆగిపోయాయని అక్కడి అధికారులు వెల్లడించారు. ఏకంగా షిప్‌లను అడ్డుకునేందుకు 25కు పైగా బోట్లలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. మర పడవలను అడ్డుపెట్టి టెర్మినల్ వైపు వాణిజ్య ఓడలు రాకుండా అడ్డుకున్నారు.

విశాఖ కంటైనర్ టెర్మినల్ నిర్మాణ సమయంలో భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఇచ్చినా, అధికారులు పట్టించుకోక పోవడంతో నిరసనకు దిగినట్లు మత్స్యకార సంఘం నాయకులు వెల్లడించారు. పరిహారం విషయం తేల్చే వరకూ టెర్మినల్ ప్రధాన గేట్లు తెరిచేది లేదని.. ఒక్క కంటైనర్ కూడా లోపలకి వెళ్లేందుకు వీల్లేదని మత్స్యకారులు తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని