Published : 01/04/2021 18:18 IST

విశాఖ ఉక్కు టర్నోవర్‌ రూ.18వేల కోట్లు

కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధికం: సీఎండీ

విశాఖ: 2020-21 ఆర్థిక సంవత్సరంలో విశాఖ ఉక్కు రూ.18వేలకోట్ల టర్నోవర్‌ నమోదు చేసినట్లు సీఎండీ పీకే రథ్‌ తెలిపారు. ఇది విశాఖ ఉక్కు చరిత్రలోనే రెండో అత్యధికమని చెప్పారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన సందర్భంగా  విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్‌ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక ఏడాదిలో కర్మాగారం 13 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలిపారు. 

ఈ 4 నెలల్లో రూ.740కోట్ల నికర లాభం నమోదైందని సీఎండీ వెల్లడించారు. మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ.3,300కోట్లకు విక్రయించామన్నారు. ఈ మార్చిలో కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు, సిబ్బంది, అధికారులకు సీఎండీ అభినందనలు తెలిపారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని