VIZAG STEEL: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు సాధించింది. జులై నెలలో అత్యధికంగా 540.8 వేల టన్నుల ఉక్కును విక్రయించి రికార్డు నెలకొల్పింది.

Updated : 03 Aug 2021 22:16 IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మరో రికార్డు సాధించింది. జులై నెలలో అత్యధికంగా 540.8 వేల టన్నుల ఉక్కును విక్రయించి రికార్డు నెలకొల్పింది. గతేడాదితో పోలిస్తే 38శాతం ఉత్పత్తి పెరిగింది. ఏప్రిల్‌ - జులై మధ్య 1,538 వేల టన్నుల ఉక్కును విక్రయించినట్టు ఆర్‌ఐఎన్‌లో ట్విటర్‌లో తెలిపింది. గతేడాదితో పోలిస్తే 48 శాతం వృద్ధి సాధించినట్టు  పేర్కొంది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న క్రమంలో విశాఖ ఉక్కు రికార్డు నెలకొల్పడం చర్చనీయాంశమైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు రెండ్రోజులుగా దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని