Andhra News: 2022-23 నాటికి విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఆధునికీకరణ: కేంద్రం

విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆధునికీకరణ వ్యయం సవరించినట్లు పెట్రోలియం శాఖ రాజ్యసభకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.20,928 కోట్ల వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరించినట్లు వెల్లడించారు. వైకాపా...

Updated : 29 Mar 2022 06:55 IST

దిల్లీ: విశాఖలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆధునికీకరణ వ్యయం సవరించినట్లు పెట్రోలియం శాఖ రాజ్యసభకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.20,928 కోట్ల వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరించినట్లు వెల్లడించారు. వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టును 2016లో హెచ్‌పీసీఎల్‌ ఆమోదించిందని.. మొదట 2020 జులై నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2022 ఫిబ్రవరి నాటికి 85 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. సమవరించిన లక్ష్యం ప్రకారం 2022-23 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రామేశ్వర్‌ తేలి స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని