Andhra News: ‘కేంద్రం వెనక్కి తగ్గాల్సిందే’.. విశాఖ ఉక్కు కార్మికుల ‘జైల్‌ భరో’

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకుంది.

Updated : 13 Feb 2022 15:19 IST

విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి.. వార్షిక పోరాట కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ కార్మికులు జైల్‌ భరో కార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ పోరాట సమితి స్పష్టం చేసింది. కార్మికుల నిరసనలో పాల్గొన్న సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి వారికి సంఘీభావం ప్రకటించారు

అనంతరం గాజువాక చేరుకున్న కార్మికులు పీఎస్ వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో కార్మికులను అరెస్టు చేసిన పోలీసులు గాజువాక స్టేషన్‌కు తరలించారు.

ప్రధాని దిగొచ్చే వరకూ పోరాడాలి: ఆర్‌.నారాయణమూర్తి

విశాఖ ఉక్కు కార్మికుల పోరాటం ఆగకూడదని.. ప్రధాని దిగొచ్చే వరకూ పోరాడాలని సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు నిర్వహించిన జైల్‌భరో కార్యక్రమంలో పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అలుపెరగని పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం తప్పు ఒప్పుకొని చట్టాలను వెనక్కి తీసుకుందని నారాయణమూర్తి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని