Samatha Murthy: సమతామూర్తి సందర్శనకు పోటెత్తిన భక్తులు

రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ఏడో రోజు పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యుల రాకతో ముచ్చింతల్‌లో సందడి నెలకొంది. రథసప్తమిని పురస్కరించుకొని

Updated : 08 Feb 2022 17:30 IST

హైదరాబాద్‌: రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో ఏడో రోజు పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యుల రాకతో ముచ్చింతల్‌లో సందడి నెలకొంది. రథసప్తమిని పురస్కరించుకొని యాగశాలలో శ్రీనారసింహ ఇష్టి హోమం నిర్వహించారు. ప్రవచన మండపంలో ప్రత్యేకంగా ధర్మాచార్య సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులకు సాదర స్వాగతం పలికిన చినజీయర్‌ స్వామి... నాలుగు అంశాలపై ధర్మాచార్య సదస్సులో చర్చించనున్నట్టు వెల్లడించారు. సమానత్వం, జాతి వివక్ష, వ్యవసాయాధారిత ఆరోగ్యం, ప్రపంచంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వల్ల కలిగే ప్రయోజనాలను ఇవాళ, రేపు ఆచార్యులంతా చర్చించి పలు తీర్మానాలు చేస్తారని జీయర్‌స్వామి తెలిపారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ధర్మాచార్య సదస్సు జరుగుతుందని పేర్కొన్న చినజీయర్‌స్వామి... జీయర్‌ కళాశాల ప్రాంగణంలో ఈసదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరో వైపు సమతామూర్తి కేంద్రం సందర్శనకు అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తి కేంద్రాన్ని దర్శించుకుంటున్నారు. సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌, దర్శకుడు వి.వి.వినాయక్‌ తదితరులు చినజీయర్‌ స్వామిని కలిసి ఆశీర్వచనాలు అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని