Vizag Steel Plant: పరిపాలనా భవనాన్ని ముట్టడించిన కార్మికులు

విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు కదం తొక్కారు. వేతనాలు పెంచాలంటూ స్టీల్‌ప్లాంట్‌ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. 

Updated : 16 May 2023 12:25 IST

గాజువాక: విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు కదం తొక్కారు. వేతనాలు పెంచాలంటూ స్టీల్‌ప్లాంట్‌ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. సెయిల్‌ తరహాలో తమకు వేతన సవరణ ఒప్పందం అమలుచేయాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. అడ్మినిస్ట్రేటివ్‌ బిల్డింగ్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.  ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు పరిపాలనా భవనం ముట్టడికి రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆరేళ్లుగా వేతన ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని