విశాఖ ఉక్కు ఉద్యోగి అదృశ్యంలో కొత్త ట్విస్ట్‌! 

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ శ్రీనివాసరావు అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖరాసి అదృశ్యమైన వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అతడి అదృశ్యంపై......

Published : 21 Mar 2021 02:05 IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ శ్రీనివాసరావు అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖరాసి అదృశ్యమైన వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అతడి అదృశ్యంపై విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. ‘స్టీల్‌ప్లాంట్‌లో శ్రీనివాసరావు ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని ప్లాంట్‌ లాగ్‌బుక్‌లో రాశాడు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో పడి చనిపోవడం అసాధ్యమని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి 10గంటలకు విధులకు హాజరయ్యాడు. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద రూ.50లక్షలు వసూలు చేశాడు. శనివారం ఉదయం ఉద్యోగాల ప్రకటన వస్తుందని వారిని నమ్మించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో 16 మందిని కూడా నమ్మించాడు. స్టీల్‌ప్లాంట్‌లో ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదు. శ్రీనివాసరావు ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం’’ అని ఏసీపీ పెంటారావు వివరించారు. 

గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ ఈ ఉదయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అతడి టేబుల్‌ వద్ద ఐడీ కార్డు, పర్సు, చరవాణి, లేఖను గుర్తించిన పోలీసులు, కార్మికులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో అతడు ఉద్యోగాల పేరుతో కొందరిని నమ్మించాడని పోలీసులు వెల్లడించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts