Singareni: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్‌ విడుదల

సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్‌ కింద రూ.1,450 కోట్లు విడుదల చేసినట్లు ఫైనాన్స్‌ డైరెక్టర్‌ బలరామ్‌ తెలిపారు.

Published : 21 Sep 2023 15:34 IST

హైదరాబాద్‌: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్‌ను ఆ సంస్థ విడుదల చేసింది. ఈ మేరకు రూ.1,450 కోట్లు విడుదల చేసినట్లు ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్‌ తెలిపారు. దసరా, దీపావళి బోనస్‌ చెల్లింపునకు కూడా సింగరేణి సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి ఎరియర్స్‌ రూపంలో రూ.3.70 లక్షల మేర వచ్చినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని